జనగామ : మత్య్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం నర్మెట్ట మండలం గండి రామారం రిజర్వాయర్లో ఉచిత రొయ్యల పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ, వలలు, వాహనాల పంపిణీతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.