తిమ్మాజిపేట, డిసెంబర్ 21 : నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి హైదరాబాద్‌లోని మర్రి స్వగృహంలో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. స్వగ్రామం తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలోని మర్రి వ్యవసాయ క్షేత్రంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, హర్షంవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు నాగం శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.