Home
Telangana
Mla Marri Janardhan Reddy Stated That The Work Of Markandeya Reservoir Is Progressing Rapidly
వేగంగా మార్కండేయ రిజర్వాయర్ పనులు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
- ఈ ప్రాజెక్టుతో 7200 ఎకరాల ఆయకట్టుకు సాగనీరు
- పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
బిజినేపల్లి, జూలై 7: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎంజీకేఎల్ఐ కాల్వ పైభాగంలో ఉన్న గ్రామాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో మార్కండేయ ఎత్తిపోతల కోసం సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మంజూరు చేయించామని తెలిపారు. సుమారు రూ.77 కోట్లతో పనులను కొనసాగిస్తున్నట్టు వివరించారు. మమ్మాయిపల్లి, శాయిన్‌పల్లి, పోలేపల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతోపాటు 17 గిరిజన తండాల పరిధిలో 7,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

