హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress) తెలంగాణలో 14 ఎంపీ సీట్లు(MP seats) గెలుచుకుంటే రాజకీయాల నుంచి తప్పు కుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం నిర్మల్(Nirmal) రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 10 నుంచి 12 ఎంపీ సీట్ల వరకు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం కనీసం పంట నష్టం అందించడం లేదని విమర్శించారు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు.