KTR | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేప ట్టి సమాచారాన్ని కాపాడాలని సీఎస్ శాంతికుమారిని కోరారు. ఈ అంశంపై గతంలో తాను బహిరంగ లేఖ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తొలగించిందని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తొలగించిన సమాచారమంతా తెలంగాణ చరిత్రలో అంతర్భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్ర, ము ఖ్యమైన సమాచారమంతా భవిష్యత్తు త రాలకు అందిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చర్య లు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.