జోగులాంబ గద్వాల : తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు తనపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికి ఆ పార్టీలో చేరబోనన్నారు. చివరి వరకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ(BRS) కోసం పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.