MLA Krishna Rao | మల్కాజిగిరి అభివృద్ధికి రేవంత్‌రెడ్డి చేసిందేమిలేదు : ఎమ్మెల్యే కృష్ణారావు
MLA Krishna Rao | మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధికి చేసిందేమిలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
బాలానగర్ , ఏప్రిల్ 3 : మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధికి చేసిందేమిలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ పరిధి వినాయక్‌నగర్‌లో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్దిచెపుతారన్నారు. మహిళలకు ఇస్తానన్నా గృహలక్ష్మి హామిని తుంగలో తొక్కారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు.
ప్రజలు పని చేసే వారిని గుర్తించి ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య, ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాజా, సీనియర్ నాయకులు మందడి సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అనుబంద కమిటీల నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నాయకురాళ్లు, కాలనీ, బస్తీల అసోసియేషన్ సభ్యులు స్థానికులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

