Krishna Mohan Reddy | పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
జోగులాంబ గద్వాల : జిల్లా దవాఖాన(District Hospital)లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సంతోష్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి సమీపంలో 300 వందల పడకల దవాఖాన నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్యానికి సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు.
అనంతరం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్,ఆర్.డి.ఓ చంద్రకళ, డీఎంహెచ్వో శశికళ, మున్సిపల్ కమిషనర్ నరసింహ, తాహసిల్దార్ వెంకటేశ్వర్లు, నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమల, హాస్పిటల్ సూపరింటెండ్ డాక్టర్ కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

