సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు(BRS activists) అండగా ఉంటూ వారిని కడుపుల్లో పెట్టుకొని చూస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy) అన్నారు. మిరుదొడ్డి టౌన్‌కు చెందిన కాస కల్యాణ్ బీఆర్ఎస్లో కీలక కార్యకర్తగా పార్టీకి సేవలు అందిస్తూ ఇటీవలేరోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కల్యాణ్‌కు బీఆర్ఎస్ పార్టీలో పార్టీ సభ్యత్వం ఉండడంతో రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును(Insurance check) సోమవారం ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కార్యకర్తలకు ఏ ఆపది వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. గ్రామాల్లోని ప్రజలు అధైర్య పడకుండా ఉంటూ పార్టీకి వెన్నుదన్నుగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు వల్లాల తస్యనారాయణ, నంట బాపురెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సల్లూరి మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాస కిష్టయ్య, కాస నారాయణ తదితరులు పాల్గొన్నారు.