హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : హైడ్రా అత్యుత్సాహంతో పేదలు,మధ్యతరగతి ప్రజలఇళ్లు కూల్చు తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మూసీ పునరుజ్జీవనంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా, పశ్య పద్మ, తకళ్లపల్లి శ్రీనివాస్, ఎన్ బాలమల్లేశ్‌తో కలిసి కూనంనేని మాట్లాడారు. హైడ్రా పేదల జోలికి వస్తే సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని హెచ్చరించారు.