గోదావరిఖని, జూన్ 1: కాంగ్రెస్తో కలిసి పనిచేసినా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూ డెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశిబరావు స్ప ష్టం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం, దేశంలో బీజేపీ అత్యం త ప్రమాదకారి అని, అందువల్లనే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ గెలిచిన చోట సీపీ ఐ బలమున్నదని, భవిష్యత్లో 25 నుంచి 30 స్థానాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారి స్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, ఎలాంటి తప్పులు చేసినా తా ము ఎప్పటికప్పుడు నిలదీస్తామని చెప్పారు. అంతకుముందు యూనియన్ సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ కార్మికులు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీని గెలిపించారని, యూనియన్ నాయకులు, కార్యకర్తలు నిస్వార్థంగా, నిజాయితీగా కార్మిక సమస్యలపై పోరాడాలని సూచించారు.