వరంగల్ : సమాజంలో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబ శివరావు(MLA Koonamnne) అన్నారు. హనుమకొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రూ.70వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చెయ్యాలి. రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలన్నారు. రుణమాఫీ విషయంలో పిచ్చి పిచ్చి సాకులు చెప్పవద్దు.
రైతుల కోపానికి గురికాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రైతుల వెంట ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. అలాగే హైడ్రా(Hydra) విషయంలో సామాన్యుల ఇండ్ల జోలికి పోవద్దు అన్నారు. హైడ్రా అనే పేరులోనే భయం ఉందని గుర్తు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జరిపాం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.