హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యా నికి ప్రమాదకరమని, నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హిమాయత్‌నగర్‌లోని రాజ్‌బహదూర్ హాల్లో శనివారం జరిగిన సీపీఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో మోదీ-షా ద్వయం ని యంతృత్వంగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఏకమై తిప్పికొట్టాయ న్నారు. దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపుతూ, ఉత్తరాది రాష్ర్టాలకు రాజకీయంగా అ ధిక ప్రాధాన్యం ఇవ్వాలనే కుట్ర ఈ బిల్లులో దాగుందని చెప్పారు.