కేస్లాపూర్లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..
Nagoba | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం తమ ఆరాధ్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మెస్రం వంశీయులు, ఎమెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ ఈ కార్మక్రమంలో పాల్గొన్నారు.

మెస్రం వంశీయులు తొలినాళ్లలో నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. అనంతరం 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం వంశీయులు నిర్మించే నాగోబా జాతర రాష్ట్రంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

