హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల బీజేపికి చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బయ్యారంలో ఉకు పరిశ్రమను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉకు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొనిరావాలని కోరారు. బయ్యారంలో ఉకు పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదంటూ లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒకరు కూడా బయ్యారం ఉక్కుపై స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉకు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. బయ్యారంలో ఉకు పరిశ్రమ ఏర్పాటుచేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నదని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమలు చేయాల్సిందేనని చెప్పారు.
‘బయ్యారం ఉకు-తెలంగాణ హకు’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉకు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బయ్యారం ప్రాంతంలో 1.41 లక్షల ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నాయని, అకడ ఉకు పరిశ్రమ స్థాపిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేసీఆర్ సోదాహరణంగా కేంద్రానికి వివరించారని తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇకడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ సగర, వంశరాజుల సంఘాల నాయకులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో వేర్వేరుగా కలిశారు. డెడికేటెడ్ కమిషన్‌కు ఇటీవల బీసీ కుల గణనపై నివేదిక సమర్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వంశరాజుల సంఘం నేతలు బొల్ల శివశంకర్, ఇదిగిచ్చే మురళీకృష్ణ, చిందం పాండు, నిమ్మల వీరన్న, సగర సంఘం నేతలు శెన్శెట్టి విజయేంద్రసాగర్, ఎస్పీపీ శ్రీనుసాగర్, బోశెట్టి భాసర్సాగర్, శ్రీధర్‌సాగర్, గోపీసాగర్, చెన్నయ్యసాగర్, సిద్ది రాములుసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రసాగర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాము బీసీ-డీలో ఉన్నామని, బీసీ-ఏలోకి మార్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తాము సంచారజాతులుగా ఉంటూ ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నామని, తమ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలని వంశరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి, ప్రధాన కార్యదర్శి పాండు కోరారు.
తెలంగాణతల్లి రూపురేఖలు మార్చి తెలంగాణ సంస్కృతి, అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, అధికారిక ఉత్సవాలు, వేదికలపై విషసంస్కృతిని ప్రవేశపెట్టడంపై ఈ నెల 14న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు.
ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తమ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉన్నదని, అలాంటిది జరిగితే మరో పోరాటం తప్పదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఆశా వర్కర్లను తొలగించాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని గురువారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.