స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 9 : సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలంటూ కడియం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో సీపీఎం కాంగ్రెస్‌ను బలపరుస్తుంటే, ఇక్కడ బీఆర్ఎస్ను బలపరుస్తున్నదని దుయ్యబట్టారు. సీపీఎంకి విధానాలు, సిద్ధాంతాలు లేవని, అవకాశవాదులు తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఊరు బాగుపడాలని, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశం వారికి లేదని కడియం పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.