స్టేషన్ ఘన్పూర్, జూలై 19: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ కడియం కావ్య చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో జరిగిన ఎంపీటీసీల వీడ్కోలు, సన్మాన సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం రూ.2 లక్షల పంట రుణాల మాఫీ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కడియం శ్రీహరి క్షీరాభిషేకం చేశారు. ఆ ఫ్లెక్సీలో ఉన్న తన కూతురు ఎంపీ కడియం కావ్య ఫొటోపై కూడా శ్రీహరి పాలు పోశారు.