MLA Jeevan Reddy | ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకునేలా స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన నవనాథ సిద్దులగుట్టతో పాటు యాదగిరిగుట్ట దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలను పంపించే కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
తొలి రోజు ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామస్తులు ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి బస్సుయాత్రను ప్రారంభించారు. మచ్చర్ల గ్రామస్తులు తొలుత సిద్దులగుట్టను దర్శించుకున్న అనంతరం యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని మధ్యాహ్నం సందర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ఈ యాత్ర ద్వారా రెండు చరిత్రాక ఆలయాలు చూపించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, మచ్చర్ల గ్రామస్తులు పాల్గొన్నారు.