హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) గవర్నర్ ప్రసంగంలో పసలేదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలను వాడి ప్రసంగ పాఠం తయారుచేసినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఎద్దేవాచేశారు. గవర్నర్ ప్రసంగం గొప్పగా, అర్ద్రతతో, మనసుపెట్టి, వాస్తవాలతో, బడ్జె ట్ ప్రతిబింబించేలా ఉండాలిగాని, ఈ ప్ర సంగాన్ని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలను ఉపయోగించి తయారుచేసినట్టు ఉన్నదని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. గవర్నర్ చేత 36 నిమిషాల్లోనే 360 అబద్ధాలు మాట్లాడించారని విమర్శించారు. కవి ఆత్రే య ఉండి ఈ ప్రసంగాన్ని చూసి ఇంత దరిద్రంగా ఉంటదా? అని ఆత్మహత్య చేసుకునేవాడని, గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరని, మెకానికల్‌గా చదివి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
ఫామ్ హౌస్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేస్తుండగా జగదీశ్‌రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారు. ‘మా నేత కేసీఆర్ మీ సీఎంకు దగ్గరగానే ఉన్నా రు. ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని కూర్చోండి’ అంటూ చురకలంటించారు. తాను రైతుల గురించి మట్లాడుతున్నానని, మీలాగా కమీషన్ల గురించి మా ట్లాడటం లేదని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
‘మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఏమిచ్చారు, ఎక్కడిచ్చా రం టూ జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రైతులకు రుణమాఫీ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? ఆటో కార్మికులు, ఈజీఎస్ కూలీ లు, రైతు కూలీలకు 12వేలు ఇచ్చారా? రై తులకు బోనస్ ఇచ్చారా? విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలిచ్చా రా? ఎక్కడిచ్చారు? అంటూ నిలదీశారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా విప్ ఆది శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుతగిలారు. ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుని తమ సభ్యుడు మాట్లాడుతుండగా, మం త్రులు అడ్డుతగులుతున్నారని. నువ్వెంత అంటే నేనేంత అన్నట్టు నడుచుకుంటే సభ నడుస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో స్పీకర్ప్రసాద్కుమార్ కల్పించుకుని గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని జగదీశ్‌రెడ్డికి సూచించారు. అధికార పక్షం డీవియేషన్ కాకుండా ఉండేందుకు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలన్నారు. మళ్లీ కల్పించుకున్న తలసాని మంత్రి కోమటిరెడ్డి గవర్నర్ ప్రసంగం మీదనే మాట్లాడారా? వారు డివియేట్ కాలేదా? అంటూ ప్రశ్నించారు.