నల్లగొండ ప్రతినిధి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్ వ్యా ఖ్యలు ఐటీ రంగంతోపాటు అందులో పనిచేసే ఉద్యోగులను చులకన చేసేలా ఉన్నట్టు తెలిపారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
నల్లగొండలో ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలోమాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, సునీత, గాదరి కిశోర్, భాస్కర్‌రావు, లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్య, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.