దోపిడీకి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీ
- ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నరు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఎక్కడ ఎంత దొరికితే అంత దోపిడీ చేస్తూ.. పదేండ్లలో కేసీఆర్ పచ్చగా మా ర్చిన తెలంగాణను ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజలు.. ప్రధానంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే అప్పటి వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని బీఎల్ఏలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రాగా స్థానిక మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్‌హాలులో ‘సర్’పై అవగాహన కల్పించా రు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, రాంచంద్రనాయక్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

