సూర్యాపేట : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరియా నుంచి రాగానే జనాల నెత్తి పైన బాంబు వేసిండు.
ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్లన్నీ ప్రైవేటీకరణ చేసి బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పి ప్రజలను మోసం చేస్తున్నామని బాంబు పేల్చిండు. తస్మాత్ ప్రజలారా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తే పన్ను కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ క్యాబినేట్లో చేసిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గ్రామీణ రోడ్లపై బడా బాబులకు పెత్తనం ఇచ్చి ప్రజలపై ట్యాక్సులే వేస్తే సహించమననారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టడంతో ఎంతోమంది ఆటోడ్రైవర్లు కూటికి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామీణ రోడ్లను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించి టోల్ ట్యాక్స్‌ల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధపడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.