మోత్కూరు, జూలై 30 : సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ద్రోహులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రాకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం నింపకుండా, కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభించకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. యా దాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన మోత్కూరు, అడ్డగూడూరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వలేని సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నింపడం కోసం కన్నెపల్లి పంపుహౌస్‌లో 17 మోటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించకపోవడంతో 5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని అన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభించి కాళేశ్వరం నింపితే ఎస్సారెస్పీ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి గ్రామ సీతారాంతండాకు నీళ్లు వచ్చేవని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
‘పోలవరం’పై చర్చ మళ్లీ వాయిదా
హైదరాబాద్, జూలై30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలపై ప్రగతి సమావేశంలో చర్చ మళ్లీ వాయిదా పడింది. ప్రాజెక్టు ముంపు సమస్యలపై బేసిన్ రాష్ర్టాలతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రగ తి సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించాలని, ప్రగతి ఎజెండాలో చేర్చారు. తుది నిమిషంలో మరోసారి చర్చించకుండానే తొలగించారు.