Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): బెస్ట్ అవైలబుల్ సూళ్లకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అ న్నా రు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ సూళ్లను (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ సూళ్లలో విద్య కోసం నిర్వహిస్తున్నారని ఆయన శనివా రం ఎక్స్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సూళ్లలో మొత్తం 25 వేల మంది చదువుకుంటున్నారని, ఇందు లో 18 వేల మంది ఎస్సీ క్యాటగిరీ, 7 వేల మంది ఎస్టీ క్యాటగిరీ విద్యార్థులు ఉన్నట్టు పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సంబంధించిన వారు, తమ కుటుంబాల్లో చదువుకుంటున్న తొలితరం వారు, ఎకువ మంది జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, కూలీల పిల్లలు ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.