హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నుంచే అమల్లో ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో బాలికలు రూపాయి ఖర్చు లేకుండా స్కూలుకు వెళ్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే అమల్లో ఉన్నది. గత ప్రభుత్వ పథకాలను, పనులను కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయం’ అంటూ హరీశ్‌రావు ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు.