కోరుట్ల రూరల్, ఏప్రిల్ 8 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవం తం చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్నగర్లో గోడల పై వాల్ రైటింగ్ చేసి వినూత్న ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు వనరులను దోచుకుంటూ తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గం నుంచి 10వేల మందితో సభకు వెళ్లనున్నట్టు తెలిపారు.