హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 13: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నుంచి తనకు ఇంకా ఎలాం టి నోటీసులు అందలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శనివారం హిమాయత్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు దానికి అనుగుణంగా వివరణ ఇస్తున్నారని పేర్కొన్నారు.
తనకు నోటీసులు వచ్చిన తర్వాత అందులో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుని లీగల్ సూచన మేరకు స్పీకర్‌కు వివరాలు తెలియజేస్తానని చెప్పారు.