హైదరాబాద్ : ఐపీఎల్ మ్యాచ్‌లపై(IPL match) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ టీంలో(SRH) ఒక్క తెలుగు ప్లేయర్ లేడని, సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో(Uppal) మ్యాచ్ ఆడనివ్వనని శుక్రవారం హెచ్చరించారు. అంతేకాదు, గతంలో సన్ రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
డేవిడ్ వార్నర్(David Warner) ఫిక్సింగ్ చేస్తున్నాడని, తాను చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుంచి తీసేశారని తెలిపారు. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టికెట్లు దొరకకపోవడానికి హెచ్‌సీఏ(HCA) విధానాలే కారణమని విమర్శించారు. 10 నిమిషాల్లోనే 45 వేల టికెట్లు ఎలా అమ్ముడుపోయాయని ప్రశ్నించారు. మరోవైపు నేడు ఉప్పల్‌లో సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్ జట్లు తలపడనున్నాయి.
అయితే ఈ మ్యాచ్‌ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లి చూస్తానని స్పష్టం చేశారు. ఒకే పార్టీకి చెందిన నేతలు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండటంతో మరికొద్ది గంటల్లో జరుగనున్న మ్యాచ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.