శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 13:24:54

అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నయ్య

మంచిర్యాల : గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబులెన్స్ ను ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల వైద్యసదుపాయాల కోసం అంబులెన్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న కాలంలో కూడా నియోజకవర్గ ప్రజల కోసం మరిన్నిసేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో  బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్,  మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, మంచిర్యాల డీఎంహెచ్‌వో నీరజ పాల్గొన్నారు.