బజార్ హత్నూర్ : భారీ వర్షాలకు(Heavy rains) పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav )అన్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పలకరించి ధైర్యంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి గుంట భూమిని రికార్డు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందేలా ఒత్తిడి తీసుకొస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.