Group-1 Results | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారులు సరిచేసినట్టుగా లేదని పేర్కొన్నారు. ఐదు తప్పులు దొర్లాయని, వాటిని టీజీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని అభ్యర్థులు దేవేందర్, రాకేశ్ తదితరులు తెలిపారు.
న్యాయవాది కృష్ణప్రసాద్ అరెస్ట్
భద్రాచలం, జూలై 7: భద్రాచలం టైమ్స్ అధినేత, న్యాయవాది కృష్ణప్రసాద్‌ను శుక్రవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయ సహాయం కోసం వచ్చిన ఓ మహిళపై లైంగికదాడి చేశారనే అభియోగంపై ఆ మహిళ ఇచ్చిన ఫిర్యా దు మేరకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కరుడుగట్టిన ఉగ్రవాది లాగా న్యాయవాదికి సంకెళ్లు వేసి తీసుకెళ్లడం దారుణమని భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ చైతన్య పేర్కొన్నారు. సోమవారం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.