Exit Polls | హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విజయ ఢంకా మోగించనున్నట్టు ఎగ్జిటిపోల్స్లో వెల్లడైంది. అధికారపక్ష ఆగడాలకు చెక్‌పెడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నట్టు పేర్కొన్నాయి. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో బీఆర్ఎస్దే విజయమని తేల్చి చెప్పగా, మరికొన్ని మాత్రం కాంగ్రెస్‌దే గెలుపన్నాయి. ఈ నేపథ్యంలో పోటీ హోరాహోరీగా ఉన్నట్టు తెలుస్తున్నది. మిషన్ చాణక్య, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడించాయి. మిషన్ చాణక్య ఎగ్జిట్‌పోల్స్‌లో బీఆర్ఎస్కు 41.60 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 39.43 శాతంతో వెనుకంజలో ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి కేవలం 18.97 శాతం మాత్రమే ఓట్లు వచ్చినట్టు తెలిపింది.
మొత్తం ఏడు డివిజన్లకు గానూ బీఆర్ఎస్ పార్టీ షేక్‌పేట, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళ్రావునగర్, సోమాజిగూడ ఐదు డిజిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించగా యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌లో కాంగ్రెస్‌కు అధిక్యం లభించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బోరబండలో కాంగ్రెస్‌కు 27.52 శాతం ఓటింగ్ రాగా బీఆర్ఎస్కు ఏకంగా 51.38 శాతం ఓటింగ్ వచ్చినట్టు వెల్లడించింది. ఇక నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ కూడా తన ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో బీఆర్ఎస్దే గెలుపని వెల్లడించింది. ఈ సంస్థ ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ 44.49 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్‌కు 39.24 శాతం, బీజేపీకి 10.93 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ సర్వేలో కూడా ఐదు డిజిజన్లలో బీఆర్ఎస్కు మెజార్టీ దక్కినట్టు వెల్లడించింది.
బోరబండలో బీఆర్ఎస్కు 51.70 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 34.29శాతం, ఎర్రగడ్డలో బీఆర్ఎస్కు 45.23 శాతం, కాంగ్రెస్‌కు 39.51శాతం, రహ్మత్‌నగర్‌లో బీఆర్ఎస్కు 41.96శాతం, కాంగ్రెస్‌కు 42.47శాతం, షేక్‌పేటలో బీఆర్ఎస్కు 49.34శాతం, కాంగ్రెస్‌కు 35.7 శాతం, సోమాజిగూడలో బీఆర్ఎస్కు 31.46 శాతం, కాంగ్రెస్‌కు 50 శాతం, వెంగళ్రావునగర్లో బీఆర్ఎస్కు 40.98 శాతం, కాంగ్రెస్‌కు 40శాతం, యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్కు 43.48శాతం, కాంగ్రెస్‌కు 37.15 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంస్థ కూడా తన ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో బీఆర్ఎస్ వేపే మొగ్గు చూపింది. ఈ సంస్థ బీఆర్ఎస్కు అత్యధికంగా 45 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించగా కాంగ్రెస్‌కు 41శాతం, బీజేపీకి 9 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
ఇవి ఇలా ఉంటే, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు కొంత మేర అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ కాంగ్రెస్‌కు 46శాతం, బీఆర్ఎస్కు 43శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. అదేవిధంగా ఎస్ఏఎస్(సాస్) సంస్థ బీఆర్ఎస్కు 44.5శాతం, కాంగ్రెస్‌కు 46.5శాతం, బీజేపీకి 6.5శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక, స్మార్ట్‌పోల్ అనే సంస్థ కాంగ్రెస్‌కు 48.2శాతం, బీఆర్ఎస్కు 42.1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ విధంగా పలు సంస్థలు బీఆర్ఎస్దే విజయమని పేర్కొనగా మరికొన్ని సంస్థలకు కాంగ్రెస్‌కు అనుకూలంగా మొగ్గుచూపాయి.
ఎగ్జిట్‌పోల్ ఫలితాలు పార్టీల వారీగా మిషన్ చాణక్య
నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్
క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్
ఎస్ఏఎస్
చాణక్య స్ట్రాటజీస్