ధరూరు, అక్టోబర్ 11 : జీతాలు ఇవ్వకుంటే(Pending salaries) ఎలా పని చేయాలంటూ మిషన్ భగీరథ కార్మికులు( Workers agitation) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ(Mission Bhagiratha) ప్రధాన వాటర్ ప్లాంట్ గేటు వద్ద నీటిశుద్ధి యంత్రాల ఆపరేటర్స్, లేబర్స్ ధర్నాకు దిగారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలే చాలీచాలని వేతనాలు.. ఆపై ఆలస్యం వస్తే తామ కుటుంబాలు ఎలా బతకాలన్నారు. వేతనాలు సార్ అని అడిగితే ఇష్టం ఉంటే పని చేయండి.. లేదంటే వెళ్లిపోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. దీంతో చేసేది లేక ఆందోళనకు దిగినట్లు తెలిపారు. మాకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలు సకాలంలో చెల్లించేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం : హరీశ్ రావు
TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!