Mahabubnagar | మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 22 : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
వెంటనే స్పందించిన వాటర్‌మెన్ పెద్ద కురుమయ్య ఆదివారం లారీ ట్యూబ్‌పై చెరువు మధ్యలోకి వెళ్లి బోరు మోటర్‌కు విద్యుత్ సరఫరా అందించారు. అలాగే బోరుకు మరమ్మతు చేసి వాటర్ ట్యాంకుకు నీటి సరఫరా ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.