చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్‌లోని బోర్ధపాడ గ్రామంలోనిది. మన్ కీ బాత్‌లతో ఊదరగొట్టుకోవడం తప్ప జన్ కీ బాధలు పట్టని బీజేపీ నేతల నిర్లక్ష్యానికి ఈ దృశ్యం అద్దం పడుతున్నది. షిండేలను సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టడంలో ఉన్న శ్రద్ధ బీజేపీ ప్రభుత్వానికి ప్రజల మీద లేదనటానికి ఇంతకన్నా రుజువేం కావాలి?
ఇట్ల నల్లా తిప్పితే అట్లా జలజలా నీళ్లు.. ఆడపడచు ముఖంలో ఆనందం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడలోనిది ఈ దృశ్యం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెల్లో కూడా నీటికటకట ఉండేది. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక మచ్చుకు ఒక్క పల్లెలో కూడ ఇలాంటి అవస్థలు కనిపించడం లేదు. మిషన్ భగీరథ ఏండ్ల గోస తీర్చింది. ఇంటింటికి నల్లా.. రోజూ పొద్దున, సాయంత్రం కావాల్సినన్ని సురక్షితమైన నీళ్లు వస్తున్నాయని సంబురపడుతున్నారు.