Miss World Pagent | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం హాజరు కావడంలేదని మొదట సీఎంవో తెలిపింది.
కానీ ఇరుదేశాల కాల్పుల విరమణతో షెడ్యూల్ మార్చుకున్నట్టు పేర్కొంది. 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొననున్న ఈ పోటీల కోసం ఇప్పటికే 111 మంది నగరానికి చేరుకున్నారు. వీరికి ప్రభుత్వ ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. జూన్ 1న హైటెక్స్‌లో ఫైనల్ పోటీ జరగనుంది. విజేతలు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.