Miryalaguda | నల్లగొండ : కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరు తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూ. 10 కోట్ల ప్రభుత్వ నిధులతో కేసీఆర్ కళా భారతి నిర్మించారు. కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాభారతి వద్ద బైఠాయించారు.