జగిత్యాల, మే 28(నమస్తే తెలంగాణ): ‘బక్రీద్‌కు కాంగ్రెస్ సర్కార్ చేసిన ఏర్పాట్లు ఏం బాగాలేవు. ఎండలు మండిపోతుంటే క నీసం టెంట్లు లేవు.. తాగేందుకు నీళ్లు కూడా లేవు. కూలర్లు, ఫ్యాన్లు లేనే లేవు.. ఇదేం పరిపాలన? ఈ కాంగ్రెస్ సర్కార్‌కు మైనారిటీలంటే పట్టింపే లేదు’ అని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పలువురు మైనారిటీలు అసహనం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ పాలనలో అంతా బాగుండేది..
ముస్లిం మైనారిటీ పం డుగలకు అన్ని సౌకర్యాలు కల్పించిండు’ అని ఆనాటి రోజులను గుర్తుచేశారు. గురువారం బక్రీద్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన ఏర్పాట్లు చే శారు. అయితే ఏర్పాట్లు సరిగా లేవని ప్రార్థనకు వచ్చిన మైనారిటీలు ఆవేదన వ్యక్తంచేశారు.
జిల్లాకేంద్రంలో బక్రీద్ కోసం ప్రభు త్వం రూ.8లక్షలు కేటాయించినా ప్రార్థనా కేంద్రాల వద్ద కనీస వసతులు లేవని మండిపడ్డారు. గతంలో ప్రార్థనా స్థలాల్లో కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి వసతి కల్పించారని, ఇప్పు డు ఏమైందని ప్రశ్నించారు. పిల్లలు, వృద్ధు లు తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. ఈ వైఫల్యానికి కారణమెవరు స్థానిక ఎమ్మెల్యేనా? మున్సిపాలిటీ అధికారులదా? అని నిలదీశారు. ఏడాదికి రెండుసార్లు వచ్చే పర్వదినాలకు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోతే ఇక ప్రభుత్వమెందుకని, మైనారిటీలపై చిన్నచూపు తగదని మండిపడ్డారు.