హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి (Peddapalli) ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సీపీ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యుడు మక్కాని సింగ్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.