ములుగు : వనదేవతల(Medaram) అనుగ్రహంతో నాడు పరాయి పాలన నుంచి విముక్తి లభించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka )అన్నారు. సోమవారం వారు ములుగులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని, అక్కడ నుంచి బయలుదేరి మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకొస్తున్న సమయంలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ తల్లుల ఆశీర్వాదంతో ఎన్నో ఏండ్ల ప్రజల కలనెరవేరిందని పేర్కొన్నారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆరు వేల బస్సులు అదుబాటులోకి ఉంచుతామన్నారు. తెలంగాణలోని మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చన్నారు.