హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. బుధవారం జల్పల్లిలోని ప్రీమియర్ ఫంక్షన్హాలులో 313 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 80 మంది దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, 180 మంది మహిళలకు కుట్టుమెషిన్లను మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి పంపిణీ చేశారు.