హైదరాబాద్ : ఖమ్మం(Khammam) జిల్లాలో వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు కిషన్ రెడ్డి( Kishan Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. ఆదివారం ఖమ్మం జిల్లా దంసలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి కారును వరద బాధితులు(Flood victims) అడ్డుకున్నారు. వర్షాలకు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, తమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వారి వెంట ఉన్న ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
కాగా, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ
ఖమ్మం జిల్లా దంసలాపురంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న వరద బాధితులు
తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి వెంట ఉన్న ఎంపీలు ఈటల రాజేందర్,… pic.twitter.com/vKOo3dNfAO
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024