సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 27: దసరా నాటికి సిద్దిపేట నెక్లెస్ రోడ్డు పూర్తవుతుందని మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట వాసులు కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద ఆదివారం రాత్రి 450 డ్రోన్లతో చేపట్టిన మెగా డ్రోన్ షోను వారు ప్రారంభించారు.
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సై రెస్టారెంట్, టన్నెల్ అక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. సిద్దిపేట మరో సింగపూర్ కానున్నదని, ఇది తెలంగాణకు మాడల్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. త్వరలోనే ఇండోర్ స్టేడియం మంజూరు చేస్తామని, సిద్దిపేటకు రావడం అంటే స్టడీ టూర్‌కు వచ్చినట్టే ఉంటుందని చెప్పారు. సింగర్ గీతామాధురి పాటలతో ఆకట్టుకొన్నారు.