హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. సోమవారం జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy cm Batti), మంత్రి శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి నివాసంలో ఏకాంత చర్చలు జరిపారు. రేపు సీఎం హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకున్నా అది మీ ఇష్టం. అప్పటి దాకా మా మాట వినాలని శ్రీధర్ బాబు, భట్టి కోరారు.
అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్లో మాట్లాడించారు. కేసీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అయితే జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ మంత్రి పదవి? ఆఫర్ చేసిట్లు తెలిసింది. అందుకే ఆయన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.
ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో అసనం వ్యక్తంచేశౠరు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 2014లో జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్.. ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించిన విషయం తెలిసిందే.