హిట్ కాంబో రిపీట్
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా.. ఆ పాటను మాత్రం యూత్ బాగా ఇష్టపడ్డారు.
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా.. ఆ పాటను మాత్రం యూత్ బాగా ఇష్టపడ్డారు. తాజాగా ధనుష్-సాయిపల్లవి కలయికలో మరో సినిమా రాబోతున్నది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నారు.
‘ధనుష్ 55’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇద్దరు కథానాయికలకు చోటున్న ఈ సినిమాలో ఇటీవలే శ్రీలీలను ఓ నాయికగా ఖరారు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి సాయిపల్లవి ఎంటరైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫొటోను విడుదల చేసింది. ‘అమరన్’ తరహాలోనే దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశమిదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి ఇతివృత్తంతో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సాయిపల్లవి హిందీలో ‘రామాయణ’ ‘ఏక్దిన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

