చాలామంది ఉదయం లేవగానే చేసే పనులు తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పెద్దగా పట్టించుకోరు. మనం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందే శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. మొదటి ముద్ద తినకముందే రక్తంలో చకెర స్థాయుల్లో అస్థిరత మొదలవుతుంది.
మీరు రోజంతా ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. ఉదయం పూట చేసే చిన్న తప్పు అనారోగ్యానికి దారితీయొచ్చు. శరీరానికి ఉదయం మనం ఇచ్చే సంకేతాలే చాలా ముఖ్యమట. సరైన సమయంలో జీవక్రియలు ప్రారంభం కాకపోవడం, ఒత్తిడి సంకేతాలు సమతుల్యంగా లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. అలా రావొద్దంటే.. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం, మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం, దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ముందే 5 నుంచి 10 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
ఇలా చేయడం వల్ల మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. తగినంత శక్తి అందుబాటులో ఉందని గ్రహించిన శరీరం.. జీవక్రియలను చురుగ్గా ప్రారంభిస్తుంది. సరైన సమయంలో సరైన నియమాలు పాటించడం ద్వారా శరీరం చురుగ్గా మారుతుంది. జీవక్రియలు సాఫీగా సాగడం వల్ల.. ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.