మలయాళ హీరో టొవినో థామస్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. డీజో జోస్ దర్శకుడు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. బుధవారం కథానాయిక కయాదు లోహర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
1950-60 దశకం మధ్య వలస రైతుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ఆధిపత్యానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం స్పూర్తివంతంగా ఉంటుందని, కథాగమనంలో హీరోయిన్ కయాదు లోహర్ పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టీజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ.