– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
– సారపాకలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బూర్గంపహాడ్, జూలై 24 : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సారపాక ప్రధాన సెంటర్లో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కేటీఆర్ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, రాష్ట్రంలో ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
అదేవిధంగా 10వ వార్డు సభ్యుడు పాటి అశోక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుడు భూక్యా కృష్ణతో కలిసి మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, బీఆర్టీయూ జిల్లా నాయకులు సానికొమ్ము శంకర్రెడ్డి, దారం కృష్ణారెడ్డి, గోనెల నాని, చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, తుపాకుల రవికుమార్, తిరుపతి ఏసోబు, బెజ్జంకి కనకాచారి, కర్రి నాగేశ్వరరావు, బానోతు శ్రీను, మణి, ఖాదర్, సాలయ్య, మోహన్, బొబ్బిలి, మహిళా నాయకులు ఎల్లంకి లలిత పాల్గొన్నారు.

‘నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం’