Commonwealth Games : కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు కొల్లగొట్టాలనుకున్న భారత జుడో(Judo)లకు వరసగా షాక్‌లు తగులుతున్నాయి. గత ఎడిషన్‌లో రజతంతో ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగాలనుకున్న తులికా మాన్ (Tulika Maan)పై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) నిషేధం విధించింది. గత 12 నెలల్లో మూడుసార్లు ఆమె డోప్ పరీక్షలో విఫలమవ్వడమే అందుకు కారణం. దాంతో కామన్వెల్త్లో పోటీ పడేందుకు ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది నాడా.
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో జుడో పోటీలకు ముందే క్రీడాకారులు నిష్క్రమిస్తున్నారు. జూలై 31 నుంచి జూడో ఫైట్ మొదలవ్వనుండగా.. తులికా మాన్‌పై నాడా నిసేధం విధించింది. మూడుసార్లు డోప్ పరీక్షలో విఫలమవ్వడంతో ఆమెను స్క్వాడ్ నుంచి తప్పించామని జుడో కోచ్ తెలిపాడు. ఇదివరకే డోప్ పరీక్షలో తేలిపోయిన జూడో ఆరుణ్ కుమార్ పోటీల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
🚨🇮🇳 A huge blow for Team India!
Judoka Tulika Maan has been suspended ahead of the Commonwealth Games, dealing a major setback to India’s campaign. pic.twitter.com/WzjwdvVFBV
— Khel Now (@KhelNow) July 24, 2026
‘ఈ 12 నెలల కాలంలో తులికా మూడుసార్లు డోప్ పరీక్షలో విఫలమైంది. ఇదే విషయమై ఆమెకు నోటీసులు పంపించాం. భారత జుడో బృందం నుంచి తులికాను తప్పిస్తున్నాం’ అని జుడో కోచ్ పీటీఐతో వెల్లడించాడు. బర్మింగ్హమ్ కామన్వెల్త్ -2022లో 78 కిలోల విభాగంలో రజతం గెలుపొందిన తులికా ఈసారి స్వర్ణంపై కన్నేసింది. కానీ, అనూహ్యంగా నాడా వేటుతో ఆమె పసిడి కల చెదిరింది.
జూలై 31 నుంచి జుడో పోటీలు ప్రారంభం కానుండడంతో.. జూలై 17న భారత బృందం స్కాట్లాండ్ చేరుకోనుంది. ఇదివరకే డోప్ పరీక్షలో పట్టుబడిన జుడోకా ఆరుణ్ కుమార్(73 కిలోలవిభాగం) పోటీల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.