Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు. ముఖ్యంగా రహదారి పనులు కూడా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్క అభివృద్ధి పని కూడా కనిపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
స్థానికుల ప్రశ్నలతో మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర అసహనానికి గురయ్యారు. సమస్యలపై నిలదీసిన ప్రజలతోనే మంత్రి వివేక్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. రహదారి అవసరమైతే ప్రభుత్వాన్ని అడుక్కోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తమ సమస్యల గురించి వినకుండా, దురుసుగా వ్యవహరించారంటూ మంత్రి వివేక్ తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మంత్రి వివేక్ వేంకట స్వామికి నిరసన సెగ
ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా కనీసం రోడ్లు కూడా వేయలేదని నిలదీసిన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు
ప్రశ్నించిన ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే వివేక్ మరియు డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథరెడ్డి pic.twitter.com/SqdskRs1sV
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2026